ఉరుకు పటేల మూవీ రివ్యూ : మనసు దోచే కామెడీ థ్రిల్లర్!

Uruku Patela Movie Review: Mind blowing comedy thriller!

లీడ్ ఎడ్జ్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై కంచర్ల బాల భాను నిర్మాణంలో వివేక్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తేజ‌స్ కంచ‌ర్ల‌, కుష్బూ చౌదరి జంటగా తెరకెక్కిన సినిమా ‘ఉరుకు పటేల’. ‘గెట్ ఉరికిఫైడ్’ సినిమా ట్యాగ్ లైన్‌. ఉరుకు పటేల సినిమా నేడు (వినాయక చవితి రోజు సెప్టెంబర్ 7న) థియేటర్స్ లోకి అడుగు పెట్టింది. మరి ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం… కథ విషయానికొస్తే.. పటేల(తేజస్) ఊరి సర్పంచ్(గోపరాజు రమణ) కొడుకు. చిన్నప్పుడే తనకు చదువు రాదని అర్ధమయిపోయి చదువు మధ్యలోనే వదిలేసి ఎప్పటికైనా బాగా చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని ఫిక్స్ అవుతాడు. అప్పట్నుంచి ఊళ్ళో చదువుకున్న ప్రతి అమ్మాయిని పెళ్లి చేసుకోమని అడుక్కొని ఛీ కొట్టించుకుంటాడు. బాగా డబ్బులు ఉండటం, సర్పంచ్ కొడుకు కావడంతో జులాయిగా తిరుగుతూ ఉంటాడు. ఒక పెళ్ళిలో అక్షర(కుష్బూ…