యంగ్ ట్యాలెంటెడ్ సందీప్ కిషన్ మ్యాజికల్ ఫాంటసీ అడ్వెంచర్ మూవీ ‘ఊరు పేరు భైరవకోన’. విఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ కథానాయికలుగా నటించారు. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా లావిష్ స్కేల్ లో నిర్మించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై అనిల్ సుంకర సగర్వంగా సమర్పిస్తున్నారు. బాలాజీ గుత్తా ఈ చిత్రానికి సహ నిర్మాత. ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులలో హ్యుజ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. ఇప్పటికే ప్రదర్శించిన ప్రీమియర్స్ కు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం శుక్రవారం (ఫిబ్రవరి16) ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపధ్యంలో చిత్ర బృందం బ్లాక్ బస్టర్ ప్రీమియర్స్ సక్సెస్ ప్రెస్ మీట్ ని నిర్వహించింది. బ్లాక్ బస్టర్ ప్రీమియర్స్ సక్సెస్ ప్రెస్ మీట్ లో హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ..…