‘తిరగబడరసామీ’ అతి త్వరలో విడుదల

'Thiragabadarasamy' will release very soon

యంగ్ అండ్ ప్రామెసింగ్ హీరో రాజ్ తరుణ్ కథానాయకుడిగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎ ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘తిరగబడరసామీ’. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ రామానాయడు స్టూడియోలో జరుగుతోంది. హీరో, హీరోయిన్, రాజా రవీంద్రపై కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ షూటింగ్ లో చిత్ర యూనిట్ మీడియాతో సమావేశం అయ్యింది. మీడియా సమావేశంలో హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ..’తిరగబడరసామీ’ మంచి కమర్షియల్ ఎంటర్ టైనర్. రవికుమార్ చౌదరి గారి గత సినిమాల్లానే యాక్షన్ కామెడీ రోమాన్స్ ఎక్కడా తగ్గకుండా వుంటాయి. ఇవాళ రేపటి తో మొత్తం షూటింగ్ పూర్తవుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడ చివరి దశలో వున్నాయి.…