సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సూపర్ మాస్ ఎంటర్ టైనర్ ‘గుంటూరు కారం’ కోసం ముచ్చటగా మూడోసారి చేతులు కలిపారు. హారిక & హాసిని క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఈ సూపర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఆగష్టు 9న సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా, స్టైలిష్ మాస్ అవతార్‌లో కనిపిస్తున్న మహేష్ బాబు సూపర్ మాస్ పోస్టర్ లను చిత్ర బృందం విడుదల చేసింది. పోస్టర్ లో లుంగీ కట్టుకొని, కళ్లద్దాలు పెట్టుకొని, బీడీ కాలుస్తున్న మహేష్ బాబు లుక్, అలాగే మరో చిత్రం లో జీన్స్, బ్లాక్ టీ షర్ట్ పై రెడ్ కలర్ షర్ట్, ఎర్రని తలపాగా తో ప్రత్యర్థుల తో తలపడుతున్నట్లుగా మహేష్ కనిపిస్తున్న…