పీపుల్స్ స్టార్ సందీప్ కిషన్, ధమాకా మేకర్ త్రినాధరావు నక్కిన లేటెస్ట్ నవ్వుల బ్లాక్ బస్టర్ మజాకా. ఈ చిత్రాన్ని ఎకె ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్స్ పై రాజేష్ దండా నిర్మించారు. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో రీతు వర్మ హీరోయిన్. మన్మధుడు ఫేమ్ అన్షు, రావు రమేష్ కీలక పాత్రలు పోషించారు. శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 26న విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ తో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ నవ్వుల బ్లాక్ బస్టర్ మజాకా థాంక్స్ మీట్ ని నిర్వహించారు. థాంక్స్ మీట్ లో హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. అందరికీ థాంక్యు. ఈ సినిమా చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. ఈ సినిమాకి అందరూ చాలా ప్రేమతో…