జనవరి 1న చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సినిమా ప్రత్యేక ప్రదర్శన భారతీయ చిత్ర పరిశ్రమకు కొత్తదనం పరిచయం చేసిన దర్శకుల్లో సింగీతం శ్రీనివాసరావు ఒకరు. ఆయన ఎన్నో గొప్ప చిత్రాలు తీశారు. అందులో తమిళ సినిమా ‘దిక్కట్ర పార్వతి’ ఒకటి. గ్రేట్ రాజాజీ జీవిత కథ ఆధారంగా తీసిన చిత్రమిది. 1974లో విడుదలైంది. దీనికి ఫిల్మ్ ఫైనాన్స్ కార్పోరేషన్ స్పాన్సర్ చేయడం విశేషం. ఇప్పుడీ సినిమా ఓ అరుదైన ఘనత సొంతం చేసుకుంది. చెన్నైలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో జనవరి 1వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు ‘దిక్కట్ర పార్వతి’ని ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. ‘దిక్కట్ర పార్వతి’కి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. రాజాజీ జన్మస్థానమైన తోరపల్లెలో చిత్రాన్ని తెరకెక్కించారు. హై కోర్టు అనుమతి తీసుకుని హోసూర్‌లోని కోర్టులో సినిమాలో కోర్టు రూమ్ సీన్స్ చిత్రీకరించారు. ఆ సన్నివేశాల్లో రియల్ లాయర్లు నటించారు. కణ్ణదాసన్ రాసిన ఓ పాటతో పాటు రాజాజీ…
