తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకు పోతున్నట్లుగానే ఆథ్యాత్మిక తెలంగాణగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు సుప్రసిద్ధ భక్త రామదాసు 392వ జయంతి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు సంగీత నాటక అకాడమీ అధ్యక్షురాలు ఆచార్య డా. అలేఖ్య పుంజాల తెలిపారు. శుక్రవారం కళాభవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయా విశేషాలు వెల్లడించారు. మార్చి 2వ తేదీ హైదరాబాద్ లాల్ బహదూర్ ఇండోర్ స్టేడియంలో ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం ఆరున్నర గంటల వరకు భక్త రామదాసు జయంతి ఉత్సవాలు జరుగుతాయని డా. అలేఖ్య పుంజాల వెల్లడించారు. ప్రతి యేటా తమిళనాడు తిరువయ్యూర్ లో జరిగే త్యాగరాజ ఆరాధనోత్సవాల మాదిరిగా ఇకపై ప్రతియేటా తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా భక్త రామదాసు జయంతి ఉత్సవాలు అధికారికంగా జరుగుతాయని ఆమె ప్రకటించారు. తెలంగాణలోని అన్ని జిల్లాల…