విక్టరీ వెంకటేష్ కెరీర్లో 75వ చిత్రంగా తెరకెక్కిన ‘సైంధవ్’ సినిమా సంక్రాంతి స్పెషల్‌గా శనివారం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి వచ్చింది. మొదటి నుండి ఈ సినిమాపై పాజిటివ్ వైబ్సే ఉన్నాయి. సంక్రాంతికి భారీ పోటీ ఉన్నప్పటికీ.. కంటెంట్‌పై ఉన్న నమ్మకంతో మేకర్స్ సంక్రాంతి బరిలోకి ‘సైంధవ్’ని దింపారు. ట్రైలర్లోనే స్టోరీ మొత్తం చెప్పేసినా.. సినిమా వెంకీ కెరీర్లోనే ది బెస్ట్ అని చెప్పుకునే కంటెంట్ ఉంటుందని దర్శకుడు శైలేష్ కొలను మొదటి నుండి చెబుతూ వస్తున్నారు. శైలేష్ చెప్పినట్లే.. ఈ సినిమాలో కంటెంట్ బాగుందని, వెంకటేష్ కెరీర్లోనే ది బెస్ట్ చిత్రం అవుతుందని.. ఇప్పటికే ఈ సినిమా చూసిన వాళ్లు సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అవుతున్నారు. నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ‘సైంధవ్’ రివ్యూస్ డిఫరెంట్‌గా చూపారు. వెంకీమామ ఇంతకు ముందు సినిమాలతో పోల్చితే.. ‘సైంధవ్’…