వెంకటేష్ నటిస్తున్న ’సైంధవ్’ సినిమా పూర్తి కావొస్తోంది. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హిందీ నటుడు నవాజుద్దీన్ సిద్ధికితో పాటు, శ్రద్ధ శ్రీనాథ్, రుహాణి శర్మ, ఆండ్రియా జెర్మియా సారా, జయప్రకాశ్ ఇలా చాలామంది వున్నారు. ఈ సినిమా కథ తండ్రి, కూతురు మధ్య వుండే అనుబంధం మీద ఉంటుందని తెలిసింది. ఇది ఒక యాక్షన్, సైన్స్, సెంటిమెంట్ అన్నీ ఇందులో వుంటాయని అంటున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఎక్కడ జరుగుతోందో తెలుసా? బీదర్ లో ’సైంధవ్’ టీము పని చేస్తోందని, అక్కడ ఒక పెద్ద పోరాట సన్నివేశం చిత్రీకరణ చేస్తున్నారని తెలిసింది. వెంకటేష్, విలన్స్ తో పోరాటం చేసే సన్నివేశాలను దర్శకుడు శైలేష్ కొలను చిత్రీకరిస్తున్నట్టుగా తెలిసింది. ఈ పోరాట సన్నివేశం, సినిమాలో చాలా కీలకం అని, అందుకనే అది…