విజయవంతమైన మరియు సృజనాత్మక దర్శకుడు సంపత్ నంది ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహిస్తున్నారు. దర్శకుడు ప్రత్యేకమైన, బలమైన హీరో పాత్రలను సృష్టించడంలో ప్రసిద్ది చెందారు. గాంజా శంకర్ కూడా తనదైన శైలిలో రూపొందనుంది. ఈ సినిమా ప్రపంచాన్ని, గాంజా శంకర్ పాత్ర స్వభావాన్ని పరిచయం చేస్తూ అనౌన్స్‌మెంట్ టీజర్‌ని సృజనాత్మకంగా రూపొందించారు. గాంజా శంకర్ అపారమైన యాటిట్యూడ్ మరియు ఎటువంటి ముప్పునైనా తొలగించగల శక్తి కలిగిన వ్యక్తిగా అభివర్ణించబడ్డాడు. నాయక పాత్ర తన శత్రువులపై “మాస్ దాడి”ని ప్రారంభించబోతోందని దర్శకుడు తెలిపారు. నిద్రపోయే ముందు సూపర్ హీరోల గురించి వినడానికి ఇష్టపడే చిన్న పిల్లవాడికి చెప్పే కథ లాగా, దర్శకుడు ఈ కథను వెల్లడించారు. తన సృజనాత్మకతో సంపత్ నంది ఈ సినిమాపై అంచనాలు, ఆసక్తి ఏర్పడేలా చేశారు. సాయి ధరమ్ తేజ్ ఇప్పటిదాకా పూర్తి…