సమాజం పట్ల బాధ్యత ఉన్న హీరోల్లో సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కూడా ఉంటారు. ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. తన సంపాదనలో కొంత ఛారిటీ కూడా చేస్తుంటారు. విజయవాడలోని వృద్ధాశ్రమం తో పాటు తెలంగాణలోని ఓ ఊళ్లో 100 మందికి పైగా ఉన్న స్కూల్ లోని పిల్లల బాధ్యత కూడా తీసుకున్నారు. అలాగే తేజ్ కు మహిళల పట్ల అమితమైన గౌరవం ఉంటుంది. ఇప్పటివరకు ఆయన నటించిన సినిమాల్లో అది స్పష్టంగా కనిపిస్తుంది. ఇటీవల విరూపాక్ష, బ్రో వంటి వరుస విజయాలు అందుకున్నారు తేజ్. తాజాగా మహిళల గొప్పతనాన్ని చాటే ఓ షార్ట్ ఫిలింలో నటించారు. ఏ ఫంక్షన్ లో అయినా మహిళల గురించి వారి భద్రత గురించి చాలా గొప్పగా చెప్పే సాయి ధరమ్ తేజ్ కి ఆడవారంటే చాలా గౌరవం.…