‘రాజా వారు రాణి గారు’, ‘SR కళ్యాణ మండపం’, ‘వినరో భాగ్యము విష్ణు కథ’ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం తాజా చిత్రం ‘రూల్స్ రంజన్’ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ‘నీ మనసు నాకు తెలుసు’, ‘ఆక్సిజన్’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న రత్నం కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి కథానాయికగా నటిస్తున్నారు. ‘రూల్స్ రంజన్’ సినిమాని స్టార్ లైట్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి నిర్మిస్తున్నారు. అమ్రిష్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఇప్పటికే విడుదలైన ‘ఎందుకు రా బాబు’, ‘సమ్మోహనుడా’, ‘నాలో లేనే లేను’ అనే మూడు పాటలు శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రతి పాట దేనికదే ప్రత్యేకను చాటుకుంటూ కట్టిపడేశాయి. పాటలు సినిమాపై అంచనాలను…