కరోనా థర్డ్ వేవ్, కర్ఫ్యూ, థియేటర్‌లలో 50 శాతం ఆక్యుపెన్సీ తదితర కారణాలతో వాయిదా పడిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కొత్త విడుదల తేదీతో చిత్ర బృందం కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డి.వి.వి.దానయ్య నిర్మించారు. ‘‘దేశవ్యాప్తంగా కరోనా పరిస్థితులు చక్కబడి, ఫుల్ కెపాసిటీతో థియేటర్లు అందుబాటులో ఉంటే మార్చి 18న, లేదంటే ఏప్రిల్ 28న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని చిత్ర బృందం ఓ పోస్టర్ విడుదల చేసి తెలిపారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ఒలివియా మోరీస్, చరణ్ సరసన అలియాభట్ నటిస్తున్నారు. అజయ్ దేవగణ్, శ్రియ కీలక పాత్రధారులు. కీరవాణి సంగీతం అందించారు. బాహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కించిన…