టాలీవుడ్ హీరోలు పాన్ ఇండియా ఇమేజ్ కోసం తెగ ఆరాటపడుతున్నారు. ఆ ఇమేజ్ కోసం దేనికైనా రెడీయే అంటున్నారు. అలాంటి ఇమేజ్ వస్తే వంద కోట్లకు పైగా పారితోషికం వస్తుందని కలలుగంటున్నారు. కానీ అదే సమయంలో పరుగెడుతున్న కాలం గురించి మాత్రం మరచిపోతున్నారు. తాజాగా ఎన్టీఆర్ ‘ట్రిపుల్ ఆర్’ విషయానికొద్దాం.. పాన్ ఇండియా ఇమేజ్ కోసం చూసుకుంటే ఈ సినిమాకు సంబంధించి అతడికి నాలుగేళ్ల కాలం వృధా అయిపోయిందిట. కనీసం ఈ సమయంలో ఆరేడు సినిమాలు చేసినా రెండు నుంచి మూడు వందల కోట్ల పారితోషికం అయినా వచ్చి వుండేదని ట్రేడ్ వర్గాలు లెక్కలు చెబుతున్నాయి. పైగా ఆ సినిమాల్లో ఏ రెండో మూడో బ్లాక్ బస్టర్ అయినా ఈ పారితోషికం మరి కాస్త ఎక్కువే అయి వుండేదని అంటున్నారు. అయితే.. డి.వి.వి సినిమాస్ బ్యానర్ పై…