RRR ‘నాటు నాటు’కు ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డు!

RRR 'నాటు నాటు' సాంగ్ కు ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డు!

– సరికొత్త చరిత్రను సృష్టించిన RRR – అవార్డు అందుకున్న మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి RRR (రౌద్రం రణం రుధిరం)…ఇద్దరు అగ్ర హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ ల కలయికలో భారతీయ సినీ చరిత్రలోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందిన చిత్రం. టాలీవుడ్ సినిమా స్థాయిని విశ్వవ్యాప్తం చేసిన దర్శక దిగ్గజం ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా ఎన్నో అంచనాలతో విడుదలై తిరుగులేని అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపి వాహ్.. అనిపించింది. దాంతో ఈ చిత్రానికి ఇప్పటికే ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ‘త్రిబుల్ ఆర్’ చిత్రానికి ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కింది. ‘నాటు నాటు’ సాంగ్‌కు అత్యుత్తమ అవార్డ్ రావడం ఏషియాలోనే తొలిసారి కావడం విశేషం. ఈ ‘త్రిబుల్ ఆర్’…