మహంకాళి మూవీస్ పతాకం పై కౌశల్ మండ మరియు లీషా ఎక్లైర్స్ (Leesha Eclairs) హీరో హీరోయిన్ గా శంకర్ దర్శకత్వం లో మహంకాళి దివాకర్ మరియు లుకలాపు మధు సంయుక్తంగా నిర్మిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం “రైట్”. మలయాళం లో జీతూ జోసెఫ్ దర్శకత్వంలో విడుదలై విజయవంతం అయిన ‘మెమోరీస్’ చిత్రం రీమేక్ ఇది. ఈ చిత్రం యొక్క మొదటి పోస్టర్ ను మరియు మోషన్ పోస్టర్ ను విక్టరీ వెంకటేష్ గారు విడుదల చేశారు. ఈ సందర్భంగా విక్టరీ వెంకటేష్ గారు మాట్లాడుతూ “కౌశల్ నటించిన రైట్ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు మోషన్ పోస్టర్ విడుదల చేయడానికి చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రానికి జీతూ జోసఫ్ కథను అందించారు. బిగ్ బాస్ తర్వాత కౌశల్ నటిస్తున్న రైట్ చిత్రం మంచి…