‘కబ్జ’ థీమ్ పోస్టర్.. అదిరింది

kabza movie theme poster released

కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర నటించగా శ్రీ సిద్దేశ్వరా ఎంటర్ప్రైజెస్ పతాకంపై నిర్మించగా, లాంకో శ్రీధర్ సమర్పణలో వస్తున్న తాజా చిత్రం ‘కబ్జ’. ఉపేంద్ర పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం థీమ్ పోస్టర్ ను ఆర్.జి.వీ. చేతులు మీదుగా విడుదల చేశారు. ‘కె.జి.ఎఫ్’తో 2018లో కన్నడ సినిమా ఇక్కడ అందరికీ దగ్గర అయినప్పటికీ, పలు తెలుగు సినిమాల్లో నటించి, దర్శకత్వం వహించిన ఉపేంద్ర ఇక్కడ అందరికి సుపరిచితమే. ఏ, ఉపేంద్ర, రక్తకన్నీరు, బుద్ధిమంతుడు, సూపర్ వంటి వైవిధ్యంగా ఉండే తన చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయ్యారు ఉపేంద్ర. సన్ ఆఫ్ సత్యమూర్తి తో 2015లో తెలుగు సినిమాను మళ్ళీ పలకరించగా, ఇప్పుడు పాన్ ఇండియన్ సినిమా ‘కబ్జ’ తో మళ్ళీ కన్నడ, హిందీ, తమిళ్, తెలుగు, మలయాళం, ఒరియా మరియు మరాఠీ భాషల్లో పలకరించబోతున్నారు. తెలుగులో…

ఆర్జీవీ బయోపిక్ పార్ట్ 1 ‘రాము’ సెట్టెక్కింది

rgv biopic part 1 ramu launched

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మూడు భాగాల బయోపిక్‌లో తొలి భాగం షూటింగ్ బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని ఓ కళాశాలలో మొదలైన ఈ షూటింగ్ కు రామ్ గోపాల వర్మ తల్లి సూర్యావతి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ఆర్జీవీ సోదరి విజయ క్లాప్ ఇచ్చారు. ఈ మూడు భాగాల బయోపిక్‌ను బొమ్మాకు క్రియేషన్స్ పతాకంపై బొమ్మాకు మురళి నిర్మిస్తున్నారు. కొత్త దర్శకుడు దొరసాయి తేజ దర్శకత్వం వహిస్తున్నారు. తొలి భాగంలో దొరసాయి తేజ టీనేజ్ రామ్ గోపాల్ వర్మ పాత్రలో నటిస్తున్నారు. ఈ పార్ట్ 1 లో వర్మ కాలేజ్ రోజులు, తొలి ప్రేమలు, గ్యాంగ్ ఫైట్స్ తో మొదలయ్యి శివ చేయడానికి ఎలాంటి పన్నాగాలు పన్నాడన్నది కథాంశంగా చూపించబోతున్నారు. మిగతా పాత్రల్లో కొత్త నటీనటులు నటిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత బొమ్మాకు మురళి మాట్లాడుతూ……