‘చూసి చూడంగానే’ ‘గమనం’ ‘మనుచరిత్ర’ వంటి చిత్రాలతో మంచి టేస్ట్ ఉన్న హీరోగా ప్రూవ్ చేసుకున్నాడు శివ కందుకూరి. అతని నుండి వచ్చిన మరో ఇంట్రెస్టింగ్ సినిమా ‘భూతద్దం భాస్కర్ నారాయణ’. విడుదలకు ముందు ఇదొక మైథాలజీ టచ్ ఉన్న క్రైమ్ థ్రిల్లర్ అని టీజర్, ట్రైలర్స్ తో పాటు ఓ శివుడి పాటతో కూడా హింట్ ఇచ్చారు. అలాగే జనాల్లోకి వెళ్లి ప్రమోషన్స్ కూడా బాగా చేశారు. స్నేహాల్, శశిధర్, కార్తీక్ నిర్మించిన ఈ చిత్రానికి పురుషోత్తం రాజ్ దర్శకుడు. నేడు (మార్చి 1,2024) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డిటెక్టివ్ థ్రిల్లర్స్ కి మంచి ఫ్యాన్స్ భేస్ వుంటుంది. కంటెంట్ వుంటే చిన్న సినిమాలు కూడా ఈ జోనర్ లో పెద్ద విజయాలు సాధిస్తుంటాయి. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ దీనికి మంచి…