రష్మి ఘాటుగా రిప్లై …

టాలీవుడ్‌ నటి రష్మి గౌతమ్‌ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. జబర్దస్త్‌ షో ద్వారా యాంకర్‌గా బుల్లితెరకు పరిచయమై ప్రేక్షకుల్లో భారీ క్రేజ్‌ సంపాదించుకుంది. అంతకుముందు సినిమాల్లో నటించినా ఈ భామకు పెద్దగా గుర్తింపురాలేదు. ఈ షో ద్వారా వచ్చిన క్రేజ్‌తో బిగ్‌ స్క్రీన్‌పై అప్పుడప్పుడు మెరుస్తోంది. మరోవైపు సోషల్‌ విూడియాలో లేటెస్ట్‌ ఫొటో షూట్స్‌తో అభిమానులను అలరిస్తూ ఉంటుంది. ఇదిలావుంటే రష్మి తాజాగా ఓ నెటిజన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవంపై ఆనందం వ్యక్తం చేస్తూ రష్మి ఇటీవల ఒక పోస్ట్‌ చేసింది. అయితే ఈ పోస్ట్‌పై నెటిజన్‌ రిప్లయ్‌ ఇస్తూ.. కాషాయపు రంగు చీర కట్టి.. అన్నీ చెడ్డ పనులు చేస్తున్నావు. అంటూ కాస్త అసభ్య పదజాలం వాడాడు. దీంతో రష్మికి మండిపోయినట్టుంది. ఆ ట్వీట్‌కు రిప్లై ఇస్తూ గట్టిగా…