Ram Charan – Rashmika : రామ్ చరణ్‌ సెన్సేషనల్ ప్రాజెక్టులో రష్మిక మందన్న!!

Ramcharan-Rashmika manddanna

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక్కో సీజన్‌లో ఒక్కో హీరోయిన్ హవా నడుస్తుంటుంది. రకుల్ ప్రీత్ సింగ్..తర్వాత పూజాహెగ్డే.. ఇప్పుడు రష్మిక మందన్న. ఇలా ఒక్కోసారి ఒక్కో హీరోయిన్ వరస అవకాశాలు అందుకుంటూ క్రేజీ స్టార్ల లిస్టులో చోటు సంపాదిస్తుంటారు. ప్రస్తుతం ఈ హీరోని కదిపినా ఇప్పుడు రష్మిక మందన్న పేరే వినిపిస్తోంది. ముఖ్యంగా స్టార్ హీరోలు కూడా ఒక్కరితో నటించిందంటే చాలు.. వరసగా అంతా అవకాశాలు ఇస్తుంటారు. ఇప్పుడు రష్మిక విషయంలో కూడా ఇదే జరుగుతోంది. తొలిసారి రెండేళ్ల క్రితం సూపర్ స్టార్ మహేష్ బాబుతో రష్మిక చేసిన ‘సరిలేరు నీకెవ్వరు’ సక్సెస్ కావడంతో.. వరసగా ఆమెకు స్టార్స్ పిలిచి మరీ ఛాన్సులిస్తున్నారు. ఈ రెండేళ్లలో రష్మిక కెరీర్ గ్రాఫ్ కూడా ఊపందుకుంది. ఊహించనంతగా బాగా పెరిగిపోయింది.తెలుగుతో పాటు తమిళం, హిందీలోనూ వరస సినిమాలు చేస్తున్న ఈ…