దర్శకుడిగా, నిర్మాతగా ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించిన డైరెక్టర్ మారుతి యూనిక్ కాన్సెప్ట్‌లతో విలక్షణమైన సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్‌తో పాన్ ఇండియా చిత్రాన్ని రూపొందిస్తున్న ఆయన తన కొత్త ప్రొడక్షన్ వెంచర్‌ను అనౌన్స్ చేశారు. మారుతీ టీమ్ ప్రొడక్ట్ సమర్పణలో రవికిరణ్ ఆర్ట్స్ ప్రొడక్షన్ నంబర్ 1గా ఎన్వీ కిరణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. విభిన్నమైన సబ్జెక్ట్‌లతో ఆకట్టుకుంటున్న యంగ్ హీరో రాజ్ తరుణ్ ఈ హోల్సమ్ ఎంటర్‌టైనర్‌లో కథానాయకుడిగా నటిస్తున్నారు. గీతా సుబ్రమణ్యం, పెళ్లి గోల 2, U&I హలో వరల్డ్ లాంటి విజయవంతమైన వెబ్ సిరీస్‌లను అందించిన జె శివసాయి వర్ధన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. అందరికీ భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మేకర్స్ ఈ చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ సినిమాకు…