ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా,సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కతున్న సినిమా పుష్ప2. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీ ఎప్పుడెప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, వచ్చే ఏడాది మార్చిలో వచ్చే అవకాశం ఉందనే ప్రచారం అయితే జరుగుతోంది. కాగా, తాజాగా ఫ్యాన్స్ ఖుషీ అయ్యే ఓ వీడియో బయటకు వచ్చింది. పుష్ప2 లొకేషన్ నుంచి ఓ వీడియో ప్రస్తుతం బయటకు వచ్చింది. ఆ వీడియోలో ఒక పెద్ద ఓపెన్ ప్లేస్ ఉంది. అందులో కొన్ని వందల లారీలు ఉన్నాయి. పుష్ప మొదటి భాగం చూసినవారికి ఈ లారీలు ఎందుకు అనే ఓ క్లారిటీ వచ్చేస్తుంది. పుష్ప ఈ లారీల్లోనే ఎర్ర చందనం దుంగలను తలరిస్తూ ఉంటారు. కాగా, ఈ వీడియో…