హీరో నాగ చైతన్య అక్కినేని, పార్వతి తిరువోతు, నిర్మాత శరత్ మరార్, దర్శకుడు విక్రమ్ కె. కుమార్ హాజరైన ఈ సిరీస్ ప్రీమియర్ ప్యాక్డ్ హౌస్‌తో ప్రారంభమై, ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. ప్రపంచవ్యాప్తంగా 240 దేశాల్లోని ప్రైమ్ మెంబర్స్ కు డిసెంబర్ 1 నుంచి ప్రైమ్ వీడియోలో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో సిరీస్‌లోని మొత్తం ఎనిమిది ఎపిసోడ్‌లు ప్రసారం కానున్నాయి. భారతదేశంలో అందరూ ఇష్టపడే ఎంటర్ టైన్మెంట్ డెస్టినేషన్ ప్రైమ్ వీడియో, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలుగు ఒరిజినల్ సూపర్‌నేచురల్ సస్పెన్స్-థ్రిల్లర్ ‘దూత’ ను ప్రస్తుతం జరుగుతున్న54వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI)లో ప్రదర్శించింది. ప్రీమియర్‌కు సిరీస్‌లోని ప్రధాన తారాగణం నాగ చైతన్య అక్కినేని, పార్వతి తిరువోతు, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మాత శరత్ మరార్, దర్శకుడు…