భారతదేశపు అత్యంత ప్రియమైన వినోదాల గమ్యస్థానం, ప్రైమ్ వీడియో ఈరోజు తన రెండవ తెలుగు ఒరిజినల్ చిత్రము, నిరంకుశాధికార ప్రభుత్వము ద్వారా మరణించినవారి సంఖ్య పెరిగిపోయిన కారణంగా స్మశానంలో చోటు తక్కువ అయిన ఒక దక్షిణభారత పల్లెటూరు లో చిత్రీకరించబడిన హాస్యభరిత చిత్రము, ఉప్పు కప్పురంబు చిత్రం యొక్క ట్రెయిలర్ ను విడుదల చేసింది. ఎల్లనార్ ఫిల్మ్స్ ప్రై లి. బ్యానర్ పై రాధిక లావూ నిర్మించగా, అని. ఐ.వి. శశి దర్శకత్వం వహించారు. వసంత్ మరింగంటి రచించిన ఈ చిత్రం లో సుహాస్ మరియు జాతీయ అవార్డు-గెలుచుకున్న నటి కీర్తి సురేష్ ప్రధానపాత్రలు పోషించగా, బాబు మోహన్, శత్రు మరియు తాళ్ళూరి రామేశ్వరి ఇతర కీలక పాత్రలలో నటించారు. ఉప్పు కప్పురంబు చిత్రము భారతదేశము మరియు ప్రపంచవ్యాప్తంగా 240 దేశాలలో జులై 4న ప్రైమ్ వీడియో…