తెలంగాణ ఫిలింఛాంబర్ ఎన్నికలు తాజాగా జరిగాయి. ఈ ఎన్నికల్లో ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ప్రతాని రామకృష్ణ గౌడ్. ఆయన తెలంగాణ ఫిలింఛాంబర్ అధ్యక్షుడిగా వరుసగా ఆరోసారి బాధ్యతలు చేపడుతున్నారు. 16 వేల మంది ఈ అసోసియేషన్ లో సభ్యులుగా ఉన్నారు. తెలంగాణ ఫిలింఛాంబర్ ఎన్నికల ఫలితాలు వెల్లడించేందుకు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా.. తెలంగాణ ఫిలింఛాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ – తెలంగాణ ఫిలింఛాంబర్ ఏర్పాటు చేసి 12 ఏళ్లవుతోంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో నేను ఆరోసారి వరుసగా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాను. నాపై నమ్మకం ఉంచి ఏకగ్రీవంగా ఎన్నుకున్న సభ్యులందరికీ కృతజ్ఞతలు. రెండేళ్లు ఈ పదవీ కాలం. ఈ రెండేళ్లలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని ప్లాన్ చేస్తున్నాం. మొత్తం 24 క్రాప్టుల్లో కలిపి తెలంగాణ ఫిలింఛాంబర్ లో 16వేల మంది ఉన్నారు.…
