పాపులర్ హారర్ థ్రిల్లర్ ఫ్రాంచైజీ ‘పిజ్జా3’ ట్రైలర్ విడుదల

Popular horror thriller franchise 'Pizza3' trailer released

మోస్ట్ పాపులర్, సక్సెస్ ఫుల్ హారర్ థ్రిల్లర్ ఫ్రాంచైజీ ‘పిజ్జా’. ఈ ఫ్రాంచైజీ లో వచ్చిన రెండు చిత్రాలు తెలుగు ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకొని, భారీ విజయాలు సాధించి, ప్రత్యేక ఫ్యాన్ భేస్ ని సంపాదించుకున్నాయి. ఇప్పుడు ‘పిజ్జా3’ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇటివలే తమిళంలో విడుదలైన ‘పిజ్జా3’ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అశ్విన్ కాకుమణి, పవిత్ర మరిముత్తు ప్రధాన పాత్రలలో మోహన్ గోవింద్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘పిజ్జా3’ తమిళనాట అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకొని ఘన విజయం సాధించింది. ఈ చిత్రం తెలుగు రైట్స్ ని సొంతం చేసుకున్న కనెక్ట్ మూవీస్ ఎల్ఎల్పీ త్వరలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. తాజాగా మేకర్స్ ట్రైలర్ ని విడుదల చేశారు. ‘’అనగనగా ఒక ఊర్లో ఓ రాజు ఉండేవాడు. ఆ రాజు…