‘టైగర్ నాగేశ్వరరావు’లో హేమలతా లవణం గారి పాత్ర పోషించడం నా పూర్వజన్మ సుకృతం: రేణు దేశాయ్

Playing the role of Hemalatha Lavanam in 'Tiger Nageswara Rao' was my destiny: Renu Desai

మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు వంశీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌ అభిషేక్ అగర్వాల్‌ ల క్రేజీ కాంబినేషన్‌ లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘టైగర్ నాగేశ్వరరావు’. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో మయాంక్ సింఘానియా సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్. గ్రిప్పింగ్ టీజర్, మ్యాసివ్ ట్రైలర్, చార్ట్‌బస్టర్ పాటలతో టైగర్ ఇప్పటికే నేషనల్ వైడ్ గా హ్యూజ్ బజ్ క్రియేట్ చేస్తుంది. అక్టోబర్ 20న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్న నేపధ్యంలో ఈ చిత్రంలో కీలకమైన హేమలతా లవణం పాత్ర పోషించిన నటి రేణు దేశాయ్ విలేకరుల సమావేశంలో ‘టైగర్ నాగేశ్వరరావు’ విశేషాలని పంచుకున్నారు. హేమలత లవణం పాత్ర గురించి చెప్పండి ? హేమలతా లవణం గారిది లార్జర్ దేన్ లైఫ్…