విఆర్ పి క్రియేషన్స్ పతాకంపై పి.పద్మావతి సమర్పణలో కిరణ్, మౌర్యాణి జంటగా సుమన్ , శుభలేఖ సుధాకర్, రవి అట్లూరి ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం పింకీ. సీరపు రవి కుమార్ దర్శకత్వంలో పసుపులేటి వెంకట రమణ నిర్మిస్తోన్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫిబ్రవరి మొదటి వారంలో గ్రాండ్ గా విడదులకు సిద్దమవుతోంది. ఈ సందర్భంగా ఈ రోజు ఫిలించాంబర్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రసన్న కుమార్, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, సాయి వెంకట్ తో పాటు చిత్ర యూనిట్ పాల్గొన్నారు. నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ మాట్లాడుతూ..`జనం, జరిగిన కథ చిత్రాలు చేసిన దర్శక నిర్మాత పసుపులేటి వెంకట రమణ గారు. ఆయన దర్శకుడు అయ్యుండి మరో దర్శకుడికి అవకాశం ఇవ్వడం గొప్ప విషయం. తన…