మహబూబాబాద్ జిల్లాలోని చిన్న గూడూరు మండల కేంద్రానికి చెందిన ప్రతాపని కృష్ణమూర్తి, సువర్ణం దంపతుల మూడవ కుమారుడైన ప్రతాపని ప్రకాశ్, ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లో జియాలజీ విభాగం నుండి జియాలజీలో పిహెచ్ డీ పొందారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం లో ప్రొఫెసర్ (జియోలాజీ విభాగం) మరియు యూనివర్సిటీ – సైన్స్ కాలేజీ ప్రిన్సిపాల్ అయిన డాక్టర్ జి. ప్రభాకర్ గారి మార్గదర్శకత్వంలో ” తెలంగాణ రాష్ట్రంలోని జనగాం జిల్లా, రఘునాథపల్లి వాటర్షెడ్లో భూగర్భ జలాలు మరియు ఉపరితల జలనిర్వహణ కోసం ఇంటిగ్రేటెడ్ రిమోట్ సెన్సింగ్ మరియు GIS అధ్యయనాలు” అనే అంశం పై డాక్టర్ ప్రకాశ్ పరిశోధన చేశారు. ఆయన జలవనరులు మరియు భూగర్భశాస్త్ర రంగాలలో రిమోట్ సెన్సింగ్ మరియు GIS టెక్నాలజీలను ఉపయోగించడంలో ప్రత్యేకత కలిగి ఉన్నారు. గతంలో, ఆయన కర్ణాటకలో ప్రపంచ బ్యాంక్ నిధులతో…