Pawan Kalyan has joined hands with blockbuster director Harish Shankar again for an action entertainer Ustaad Bhagat Singh, which was launched amidst pomp and fanfare recently. The much-anticipated film is bankrolled by Y Ravi Shankar and Naveen Yerneni under Mythri Movie Makers. The film officially went on floors today. The first schedule of the film will progress at a specially erected police station set over a week featuring Pawan Kalyan and other lead actors. Cinematographer Ayananka Bose, production designer Anand Sai and director Harish Shankar extensively worked on the pre-production…
Tag: Pawan kalyan
సితార ఎంటర్టైన్మెంట్స్లో పవన్ చిత్ర ప్రకటన వీడియో
మరో చిత్రం ప్రకటించిన పవన్ కల్యాణ్
టాలీవుడ్ అగ్రనటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నం:12 గా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు అధికారికంగా, విజయదశమి పర్వదినం సందర్భంగా ప్రకటించారు. ఈ చిత్రానికి ప్రతిభావంతమైన యువ దర్శకుడు సాగర్.కె. చంద్రను దర్శకునిగా ఎంపిక చేసుకున్నారు. ఇదే విషయాన్ని వివరంగా పొందుపరుస్తూ వినూత్నంగా ఓ వీడియో రూపంలో ప్రకటించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో తొలిసారి తమ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించనుందని తెలిపారు. ఈ చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కనిపించనున్నారు..’గబ్బర్ సింగ్’ గా పోలీస్ ఆఫీసర్ పాత్రలో తనదైన నటనతో అశేష ప్రేక్షకులను అలరించిన పవన్ కళ్యాణ్ మరోమారు పోలీస్ పాత్రలో ఈ చిత్రం ద్వారా రక్తి కట్టించనున్నారు. కాగా ఈ…
ఆనంద సాయికి పవన్ అభినందనలు
యాదాద్రి ఆలయ ముఖ్య ఆర్కిటెక్ట్, ప్రముఖ కళా దర్శకుడు ఆనంద సాయి ఇటీవలే ‘ధార్మికరత్న’ పురస్కారం అందుకున్నారు. ఈ పురస్కారం స్వీకరించిన క్రమంలో జనసేన అధ్యక్షుడు, సినీ హీరో పవన్ కల్యాణ్ శుక్రవారం సాయంత్రం ఆనంద సాయిని అభినందించారు. హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో ఆనంద సాయిని శాలువాతో సత్కరించి.. లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయ నిర్మాణంలో ఎంతో నిష్టతో పాలుపంచుకోవడం ప్రశంసనీయం అన్నారు. ఆలయ నిర్మాణం, సంబంధిత వాస్తు అంశాలపై ఎంతో పరిశోధన చేసిన ఆయనకు ధార్మికరత్న పురస్కారం దక్కడం సముచితం అని చెప్పారు. నటుడు నర్రా శ్రీను ఈ సత్కారంలో పాల్గొని అభినందనలు తెలియచేశారు. శ్రీ శాంతికృష్ణ సేవా సమితి ఇటీవల హైదరాబాద్‌లోని బిర్లా ఆడిటోరియమ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి చేతుల మీదుగా ఆనంద సాయి…
జనసేనానితో కిచ్చా భేటీ
జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్‌ని ప్రముఖ నటుడు, కన్నడ కథానాయకుడు కిచ్చా సుదీప్ మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం ఉదయం హైదరాబాద్‌లోని పవన్ కల్యాణ్ కార్యాలయానికి సుదీప్ గారు వచ్చారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌కి మొక్కలు బహూకరించారు. వారిద్దరి మధ్య సుమారు గంట సేపు సంభాషణ సాగింది. కోవిడ్ అన్ లాక్ నేపథ్యంలో ఇటీవలే సినిమా చిత్రీకరణలు మొదలయ్యాయి. ఈ క్రమంలో తాను నటిస్తున్న చిత్రాల గురించి సుదీప్ వివరించారు. కోవిడ్ ప్రోటోకాల్ నిబంధనలకు అనుగుణంగా షూటింగ్స్ చేయడంపై వారిద్దరూ మాట్లాడుకున్నారు. వర్తమాన, సామాజిక అంశాలపై ఆలోచనలను పంచుకున్నారు. ఆసక్తికర అంశం ఏమిటంటే… ఇద్దరి జన్మదినం సెప్టెంబర్ 2వ తేదీ కావడం.
పవన్ బర్త్‌డే స్పెషల్: ‘ఉప్పెన’ న్యూ పోస్టర్
పంజా వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్న చిత్రం ‘ఉప్పెన’. విజయ్ సేతుపతి ఒక కీలక పాత్ర పోషిస్తోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. బుధవారం (సెప్టెంబర్ 2) పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకొని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ‘ఉప్పెన’ చిత్ర బృందం హీరో వైష్ణవ్ తేజ్ న్యూ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో వైష్ణవ్ తేజ్ చాలా హ్యాపీ మూడ్‌లో కనిపిస్తున్నారు. కలర్‌ఫుల్ షర్ట్ ధరించి కాలర్‌ను నోటితో పట్టుకొని, నడుంపై చేయిపెట్టి సూపర్ హ్యాండ్సమ్‌గా ఉన్నారు వైష్ణవ్ తేజ్. హీరోయిన్‌ను చూస్తున్న ఆనందం ఆయన ముఖంలో కనిపిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రంలోని పాటలకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. రాక్‌స్టార్ దేవి శ్రీప్రసాద్ బాణీలు…
‘వకీల్ సాబ్’ మోషన్ పోస్టర్ విడుదల
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ‘వకీల్ సాబ్’ మోషన్ పోస్టర్ విడుదలపవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘వకీల్ సాబ్’. ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, బే వ్యూ ప్రాజెక్ట్స్ పతాకాలపై దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీరామ్ వేణు దర్శకుడు. పవన్‌కళ్యాణ్ పుట్టినరోజు(సెప్టెంబర్ 2) సందర్భంగా ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఒక వైపు మహాత్మాగాంధీ ఫొటో, మరో వైపు అంబేద్కర్ ఫొటో మధ్య పవన్ లాయర్ కోటు వేసుకుని నిలబడ్డారు. ఓ చేతిలో బేస్‌బాల్ స్టిక్, మరో చేతిలో క్రిమినల్ లా అనే పుస్తకం పట్టుకుని పవన్ ఠీవిగా నిలబడి ఉన్నలుక్‌తో ఉండేలా మోషన్ పోస్టర్ ప్రేక్షకాభిమానుల అంచనాలను మించేలా ఉంది. ఈ మోషన్ పోస్టర్ బ్యాగ్రౌండ్‌లో సత్యమేవ జయతే…