మాస్ ప్రేక్షకులకు, అభిమానులకు సరికొత్త ట్రీట్ ని ఇవ్వడానికి ప్రముఖ నటీనటుల పేర్లను పాటల సాహిత్యంలో ఉపయోగించడం చూస్తుంటాం. ఇప్పుడు ‘ఆదికేశవ’ చిత్ర బృందం కూడా అదే ట్రెండ్ ని ఫాలో అవుతూ మాస్ మెచ్చే ‘లీలమ్మో’ అంటూ సాగే మూడో పాటను విడుదల చేసింది. ‘లీలమ్మో’ పాట విడుదల వేడుక హైదరాబాద్ లోని పార్క్ హయత్ లో బుధవారం సాయంత్రం అభిమానులు, మీడియా సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో చిత్ర బృందం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కథానాయకుడు పంజా వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ.. “ప్రతిరోజూ సెట్ కళకళలాడుతూ ఉండేది. శ్రీలీల, సుదర్శన్ గారు సెట్ కి వస్తే ఇంకా ఎక్కువ కళకళలాడేది. షూటింగ్ అంతా ఎంతో సరదాగా జరిగింది.” అన్నారు. కథానాయిక శ్రీలీల మాట్లాడుతూ.. “ఇప్పుడే అమ్మవారి దసరా అయింది. నవంబర్ 10న శివుడి…