జీ స్టూడియోస్ సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఉమేష్ కుమార్ బన్సాల్‌తో కలిసి నిహారిక కొణిదెల ‘రాకాస’ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీకి మానస శర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 3న రిలీజ్ చేశారు. అన్ని చోట్లా ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ దక్కింది. ఈ క్రమంలో శుక్రవారం నాడు చిత్రయూనిట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో.. నిహారిక కొణిదెల మాట్లాడుతూ ..‘‘రాకాస’ మూవీని ఆడియెన్స్‌తో పాటుగా చూశాం. ప్రీమియర్ల నుంచే మా సినిమాకి మంచి రెస్పాన్స్ దక్కింది. మేం ఎక్కడైతే ఆడియెన్స్ ఎక్కువగా నవ్వుతారు, ఎంజాయ్ చేస్తారు? అని అనుకున్నామో అక్కడ అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో తీసిన మా ‘రాకాస’ని చూసి…
