యంగ్ హీరో విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్, ఆశా భట్ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘ఓరి దేవుడా’. ఈ సినిమాను అనౌన్స్ చేసిన రోజు నుంచి అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రసాద్ వి. పొట్లూరి నిర్మాతగా అశ్వత్ మారి ముత్తు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తన్నారు. స్టార్ హీరో వెంకటేష్ ఇందులో దేవుడు పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దీపావళి సందర్భంగా అక్టోబర్ 21న విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం నాడు రాజమండ్రిలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. రామ్ చరణ్ మాట్లాడుతూ.. ‘పీఆర్వోగా నాతో ఎన్నో సినిమాలు చేసిన వంశీ.. ఈ చిత్రంతో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా మారారు. ఆయనకు ఆల్ ది బెస్ట్. పీవీపీ సంస్థ…