ఎన్టీఆర్‌తో సినిమా చేయడానికి పలువురు దర్శకులు ఇప్పుడు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. వరుసగా క్రేజీ డైరెక్టర్స్‌తో తన తదుపరి ప్రాజెక్ట్స్ చేస్తోన్న యంగ్ టైగర్ దూకుడు ఇక ఆగేట్లు లేదు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత త్వరలో కొరటాల శివ సినిమా షూటింగ్‌లో జాయిన్ కానున్నారు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ఉంటుంది. దీంతో పాటు గతేడాది బంపర్ హిట్ ఇచ్చిన దర్శకుడికి కూడా ఓకే చెప్పినట్టు తెలిసింది. రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి దాదాపు మూడేళ్లు కేటాయించారు ఎన్టీఆర్. ఆర్ఆర్ఆర్ కారణంగా 2019, 2020, 2021 మూడేళ్లలో ఎన్టీఆర్ ఏ సినిమా విడుదల కాలేదు.కెరీర్ మొదలుపెట్టి నప్పటి నుంచి వరుసగా మూడేళ్లలో ఎన్టీఆర్ సినిమా విడుదల కాకపోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. అందుకే ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్టీఆర్ వరుసగా క్రేజీ డైరెక్టర్స్‌తో నెక్ట్స్ ప్రాజెక్ట్ చేస్తున్నట్టు ప్రకటించారు.…