‘నిండు చందమామ’ నుంచి ‘నిలవనీ ఈ క్షణం..’ పాట విడుదల

ninduchandamama movie nunchi nilavani kshanam song relese

గణేష్ శ్రీ వాస్తవ్ హీరోగా స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘నిండు చందమామ’. గణేష్ శ్రీ వాస్తవ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి. త్వరలోనే విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘నిలవనీ ఈ క్షణం..’ పాటను విడుదల చేశారు. ఈ సందర్బంగా నిర్మాత, దర్శకుడు, హీరో గణేష్ శ్రీ వాస్తవ్ చిత్ర విశేషాలను వివరిస్తూ .. . ‘నిండు చందమామ’ చిత్రంలో మొత్తం నాలుగు పాటలున్నాయి. తాజాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన పాట ‘నిలవనీ ఈ క్షణం..’. ఈ పాటకంటే ముందు విడుదల చేసిన ‘నింగిలో ఉన్నదే నిండుచందమామ’, ‘నీ ప్రేమకే..’ పాటలు మంచి ఆదరణను పొందాయి. వేటికవే భిన్నంగా ఉంటూ అందర్నీ అలరించాయి. సంగీత, సాహిత్యాల మేళవింపు మా చిత్రం ‘నిండు చందమామ’…