పంజా వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్న చిత్రం ‘ఉప్పెన’. విజయ్ సేతుపతి ఒక కీలక పాత్ర పోషిస్తోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. బుధవారం (సెప్టెంబర్ 2) పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకొని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ‘ఉప్పెన’ చిత్ర బృందం హీరో వైష్ణవ్ తేజ్ న్యూ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో వైష్ణవ్ తేజ్ చాలా హ్యాపీ మూడ్‌లో కనిపిస్తున్నారు. కలర్‌ఫుల్ షర్ట్ ధరించి కాలర్‌ను నోటితో పట్టుకొని, నడుంపై చేయిపెట్టి సూపర్ హ్యాండ్సమ్‌గా ఉన్నారు వైష్ణవ్ తేజ్. హీరోయిన్‌ను చూస్తున్న ఆనందం ఆయన ముఖంలో కనిపిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రంలోని పాటలకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. రాక్‌స్టార్ దేవి శ్రీప్రసాద్ బాణీలు…