నందమూరి బాలకృష్ణ ఆల్ టైమ్ క్లాసిక్ ‘భైరవద్వీపం’ 4కె ట్రైలర్ విడుదల

Nandamuri Balakrishna's all time classic 'Bhairavadweepam' 4K trailer released

1974లో అద్భుతమైన అరంగేట్రం చేసిన నటసింహ నందమూరి బాలకృష్ణ సినీ పరిశ్రమలో 50 గ్లోరియస్ ఇయర్స్ పూర్తి చేసుకున్నారు. ఈ అద్భుతమైన ప్రయాణాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి నటసింహ బాలకృష్ణ ఆల్ టైమ్ క్లాసిక్ హిట్ “భైరవద్వీపం” ఈ తరం ప్రేక్షకులను అద్భుత ప్రపంచంలోకి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉంది. 1994లో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ ఎవర్‌గ్రీన్ ఫాంటసీ ఎంటర్‌టైనర్… క్లాప్ ఇన్ఫోటైన్‌మెంట్ ద్వారా గ్రాండ్‌గా రీ-రిలీజ్ అవుతోంది. ప్రేక్షకులకు మెమరబుల్ సినిమాటిక్ అనుభూతిని అందించి, బాక్సాఫీస్ వద్ద అద్భుతాలను సృష్టించిన ఈ చిత్రం.. అప్‌గ్రేడ్ చేసిన 4కె క్వాలిటీతో ఆగస్ట్ 30, 2023న ప్రేక్షకుల ముందుకు రానుంది. టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్ అనిల్ రావిపూడి, బాబీ (కెఎస్ రవీంద్ర), గోపీచంద్ మలినేని ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఆదిత్య మ్యూజిక్‌లో రీ-రిలీజ్ ట్రైలర్‌ను విడుదల…