అమిత్ తివారీ, భానుశ్రీ, నాజర్, తనికెళ్ల భరణి, అజయ్ ఘోష్, కాలకేయ ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం నల్లమల. ఈ చిత్రం ద్వారా రవి చరణ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఆర్.ఎమ్ నిర్మిస్తున్న ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ముఖ్య అతిథిగా పాల్గొని నల్లమల ట్రైలర్‌ను విడుదల చేశారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ‘అందరూ కొత్త వాళ్లు కలిసి ఇలా కొత్త సినిమాలు తీస్తున్నారు. మామూలుగానే సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ పర్సంటేజ్ చాలా తక్కువ. ఇలా కొత్త వాళ్లంతా కలిసి వస్తుంటే మరింత తక్కువగా ఉంటుంది. ఎంత మంది సక్సెస్ అవుతున్నారో గమనించి సినిమాలు తీయండని నా వద్దకు వచ్చే వారికి చెబుతాను. కొత్తగా చేసే వాళ్లని ప్రోత్సహించాలని నాకు ఉంటుంది. అలా…