ఏప్రిల్ 17న నాగ శౌర్య ‘బ్యాడ్ బాయ్ కార్తిక్’

Naga Shaurya's 'Bad Boy Karthik' to release on April 17

హీరో నాగ శౌర్య అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘బ్యాడ్ బాయ్ కార్తిక్’తో అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్‌పై శ్రీనివాస రావు చింతలపూడి నిర్మాణంలో, నూతన దర్శకుడు రామ్ దేశిన (రమేష్) దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా మ్యూజిక్ ప్రమోషన్స్ ఇప్పటికే భారీ బజ్‌ను సృష్టించాయి. విడుదలైన ప్రతి పాట చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. హై-వోల్టేజ్ సన్నివేశాలు మాస్ యాటిట్యూడ్‌తో నిండిన ఈ సినిమా టీజర్, చిత్రంపై ఉన్న అంచనాలను మరింత పెంచింది. వేసవిలో విడుదలయ్యే భారీ చిత్రాలలో ఒకటిగా ‘బ్యాడ్ బాయ్ కార్తిక్’ ఏప్రిల్ 17న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. రిలీజ్ డేట్ పోస్టర్ లో ఫైర్ బ్యాక్ డ్రాప్, ఒక చేతిలో ఆయుధం పట్టుకుని, మరో పిడికిలి బిగించి నాగ…