ఫిబ్రవరి 23న మిస్టీరియస్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘ఇంటి నెం.13’ విడుదల!

Mysterious suspense thriller 'Inti No. 13' will be released on February 23!

హారర్‌ చిత్రాల్లో ఓ కొత్త ట్రెండ్‌ని క్రియేట్‌ చేసిన చిత్రం ‘కాలింగ్‌ బెల్‌’. ఈ చిత్రం విజయం సాధించి దర్శకుడు పన్నా రాయల్‌కు మంచి పేరు తెచ్చింది. అదే స్ఫూర్తితో చేసిన రెండో సినిమా ‘రాక్షసి’ కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు మూడో సినిమాగా దర్శకుడు పన్నా రాయల్‌ రూపొందించిన మరో హారర్‌ అండ్‌ మిస్టీరియస్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘ఇంటి నెం.13’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రీగల్‌ ఫిలిం ప్రొడక్షన్స్‌ పతాకంపై డా. బర్కతుల్లా సమర్పణలో హేసన్‌ పాషా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో ఉండే ఈ సినిమాను హాలీవుడ్‌ టెక్నీషియన్స్‌తో రూపొందించడం విశేషం. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌, టీజర్‌, ట్రైలర్‌ విడుదలై ఆడియన్స్‌లో సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి. ఈమధ్యకాలంలో చక్కని హారర్‌ థ్రిల్లర్స్‌ రాలేదు. దాన్ని భర్తీ చేస్తూ ఇప్పుడు…