శ్రీ వెంకటేశ్వరస్వామి మూవీస్ పతాకంపై, ప్రదీప్ రాజ్ దర్శకత్వంలో, రమేష్ ఆర్.కె. నిర్మిస్తున్న చిత్రం మిస్టర్ ధర్మ (బ్రదర్ ఆఫ్ యమ).ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ వేడుక ఫిలింఛాంబర్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు బసిరెడ్డి, ప్రముఖ రచయిత, దర్శకుడు వడ్డేపల్లి కృష్ణ, దర్శకుడు బాజ్జీ, నటుడు కోట శంకరరావు, శాంత కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బసిరెడ్డి మాట్లాడుతూ… బడ్జెట్ చిత్రాల నిర్మాతలు పడుతున్న బాధలను ప్రముఖ రచయిత, దర్శకుడు బాజ్జీ గారు చెప్పిన విషయాల పట్ల ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా నా వంతు కృషి చేస్తున్నాను. చిన్న నిర్మాతల సాదక బాధకాలను దృష్టిలో పెట్టుకొని చిన్న చిత్రాల రిలీజ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ ద్వారా షేరింగ్ విధానంలో కొన్ని చిత్రాలను విడుదల…