మహంకాళి మూవీస్, మహంకాళి దివాకర్ సమర్పణలో మణిదీప్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై లుకాలపు మధు, సోమేశ్ ముచర్ల నిర్మాతలుగా దత్తి సురేష్ బాబు నిర్మాణ నిర్వాహణలో ప్రముఖ కామెడీ హీరో షకలక శంకర్ లీడ్ రోల్‌లో రూపొందుతున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ ‘బొమ్మ అదిరింది – దిమ్మ తిరిగింది’. నూతన దర్శకుడు కుమార్ కోట ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. బొమ్మ అదిరింది – దిమ్మ తిరిగింది అనే క్యాచీ టైటిల్‌తో అటు ఆడియెన్స్ ఇటు ఇండస్ట్రీ వర్గాల ఎటెన్షన్ తెచ్చుకున్న ఈ చిత్ర బృందం ఆ తరువాత రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్‌తో కూడా అనూహ్య స్పందన అందుకున్నారు. ఈ నేపథ్యంలో యూనిట్ సభ్యులు తాజాగా ఓ మోషన్ పోస్టర్ సిద్ధం చేశారు. దసరా సందర్భంగా ఈ మోషన్ పోస్టర్‌ను ప్రముఖ స్టార్ హీరోయిన్ డస్కీ…
Tag: motion poster
‘టెంప్ట్ రాజ’ మోషన్ పోస్టర్ విడుదల
సే క్రియేషన్స్ బ్యానర్ పై ఏఆర్కె ఆర్ట్స్ సమర్పణలో వస్తోన్న సినిమా “టెంప్ట్ రాజ”. ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోంది. ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను తాజాగా విడుదల చేశారు చిత్ర యూనిట్. ఈ సందర్భంగా హీరో మరియు నిర్మాత రాంకి (వీర్నాల రామకృష్ణ) మాట్లాడుతూ… “టెంప్ట్ రాజ” సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుంది. ముఖ్యంగా యూత్ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అవుతారు. అడల్ట్ కామెడీ ఎంటర్టైనర్ గా యూత్ ని అలరిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా మోషన్ పోస్టర్ విడుదల చేసాం. త్వరలో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుపుతాము. పోసాని కృష్ణ…
‘విధిలిఖితం’ మోషన్ పోస్టర్ విడుదల
శ్రీ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో సోషియో ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్‌గా నిర్మాత పాండు నిర్మాణంలో ఎమ్ లోచన్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న చిత్రం ‘విధిలిఖితం’. ఈ చిత్రంలో శశాంక్ మంగు, భవ్యశ్రీ హీరోహీరోయిన్స్‌గా చేస్తుండగా అతి ముఖ్యమైన పాత్రలో ప్రముఖ నటుడు సూర్యకుమార్ భగవాన్ దాస్ నటిస్తున్నారు. వైవిధ్యమైన కథ, కాన్సెప్ట్‌తో ఆధ్యంతం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ చిత్రం యొక్క మోషన్ పోస్టర్‌ని విడుదల చేశారు. ఈ పోస్టర్ చూసిన వారంతా కొత్తగా ఫీల్ అవటం చిత్ర యూనిట్‌కి చాలా ఆనందం కలిగించింది. ఈ సందర్బంగా నిర్మాత పాండు మాట్లాడుతూ.. ‘‘రెగ్యులర్ చిత్రాలు తీస్తే చూసే పరిస్థితి ఇప్పడు లేదు. ఒక కొత్త పాయింట్‌తో సినిమా తీయకపోతే ఈ కాంపిటేషన్‌లో వుండటం కష్టంగా వుంది. డైరెక్టర్ ఎమ్ లోచన్ చెప్పిన కథ చాలా…
‘రైడర్’ ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్ విడుదల
మాజీ ప్రధాని హెచ్.డి. దేవెగౌడ మనవడు, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు యువరాజా నిఖిల్ కుమార్ హీరోగా నటిస్తున్న నాలుగో చిత్రానికి ‘రైడర్’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రానికి విజయ్ కుమార్ కొండా దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో, స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందుతున్న ఈ సినిమాను లహరి ఫిలిమ్స్ బ్యానర్‌పై చంద్రు మనోహరన్ నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 11న శుక్రవారం సాయంత్రం ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో నిఖిల్ కుమార్ పరుగెత్తుతూ కనిపిస్తున్నారు. ఆయన యాక్షన్ మోడ్‌లో ఉన్నారనీ, గూండాలను చితగ్గొడుతున్నారనీ వాళ్లు చెల్లాచెదురుగా కిందపడిపోవడం తెలియజేస్తుంది. ‘రైడర్’ అనే టైటిల్‌కు పూర్తి న్యాయం చేస్తున్నట్లుగా ఆ ఫస్ట్ లుక్‌లో ఆయన కనిపిస్తున్నారు. ఫస్ట్ లుక్‌తో పాటు విడుదల చేసిన మోషన్ పోస్టర్ మరింత…
‘వకీల్ సాబ్’ మోషన్ పోస్టర్ విడుదల
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ‘వకీల్ సాబ్’ మోషన్ పోస్టర్ విడుదలపవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘వకీల్ సాబ్’. ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, బే వ్యూ ప్రాజెక్ట్స్ పతాకాలపై దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీరామ్ వేణు దర్శకుడు. పవన్‌కళ్యాణ్ పుట్టినరోజు(సెప్టెంబర్ 2) సందర్భంగా ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఒక వైపు మహాత్మాగాంధీ ఫొటో, మరో వైపు అంబేద్కర్ ఫొటో మధ్య పవన్ లాయర్ కోటు వేసుకుని నిలబడ్డారు. ఓ చేతిలో బేస్‌బాల్ స్టిక్, మరో చేతిలో క్రిమినల్ లా అనే పుస్తకం పట్టుకుని పవన్ ఠీవిగా నిలబడి ఉన్నలుక్‌తో ఉండేలా మోషన్ పోస్టర్ ప్రేక్షకాభిమానుల అంచనాలను మించేలా ఉంది. ఈ మోషన్ పోస్టర్ బ్యాగ్రౌండ్‌లో సత్యమేవ జయతే…