భారతదేశంలో అతిపెద్ద స్వదేశీ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అయిన ZEE5లో ఓ అచ్చమైన, స్వచ్చమైన తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో ‘మోతెవరి లవ్ స్టోరీ’ అనే సిరీస్ రాబోతోంది. అనిల్ గీలా, వర్షిణి రెడ్డి జున్నుతుల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌ను శివ కృష్ణ బుర్రా రూపొందించారు. ఈ సిరీస్‌కు చరణ్ అర్జున్ సంగీతాన్ని అందించగా.. శ్రీకాంత్ అరుపుల కెమెరామెన్‌గా పని చేశారు. మధుర శ్రీధర్, శ్రీరామ్ శ్రీకాంత్ సంయుక్తంగా నిర్మించిన ఈ సిరీస్ ఆగస్ట్ 8న జీ5లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ క్రమంలో మంగళవారం నాడు మెగా ప్రివ్యూ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సిరీస్‌లోని మొదటి నాలుగు ఎపిసోడ్‌లను ప్రత్యేక ప్రదర్శించారు. అనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో.. కందకట్ల సిద్దు మాట్లాడుతూ .. ‘‘మోతెవరి లవ్ స్టోరీ’ టీంకు కంగ్రాట్స్. ఇది సిరీస్‌లా…
