మరొక ప్రతిష్టాత్మక జాతీయ పురస్కారం డా. మహ్మద్ రఫీ అవార్డుల ర్యాక్ లో చేరింది! జాతీయ మానవ హక్కుల సంస్థ, అరుణాచల్ ప్రదేశ్ ప్రతియేటా నిర్వహించే ఇండియన్ ఐకాన్ పురస్కారం లభించింది. ఈ నెల 27న ఢిల్లీ లీనా యాంబియెన్స్ హోటల్ కన్వెన్షన్ లో జరిగిన పురస్కారాల ప్రదానోత్సవం లో పర్యావరణం, క్రీడలు, అటవీ శాఖ మంత్రి శ్రీ మామా నతుంగ్ (అరుణాచల్ ప్రదేశ్) చేతుల మీదుగా ఇండియన్ ఐకాన్ పురస్కారం స్వీకరించారు. ఈ వేడుక లో వివిధ రాష్ట్రాల నుంచి లబ్ద ప్రతిష్టులను ఎంపిక చేసి ఇండియన్ ఐకాన్ పురస్కారాలతో ఘనంగా సత్కరించారు.మహ్మద్ రఫీతో పాటు ప్రముఖ సైకాలాజిస్ట్ శ్రీ బి.వి.సత్య నగేష్, జాతీయ టెన్నిస్ క్రీడాకారిణి డాక్టర్ రేఖా గౌడ్ తెలంగాణ నుంచి ఎంపికై పురస్కారాలు స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి గుంటూరు కార్పొరేషన్ ఐఇఎస్…