ప్రముఖ ఓటిటి ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదలైన సూపర్ హిట్ వెబ్ సిరీస్ మీర్జాపూర్ 1కి సీక్వెల్ గా మీర్జాపూర్ సీజన్ 2 అక్టోబర్ 23న రాబోతుంది. సీజన్ 1లో ఖాలీన్ భయ్యాగా ఫేమెస్ అయిన నటుడు పంకజ్ త్రిపాఠి సిజీన్ 2 రిలీజ్ సందర్భంగా తెలుగు సినీ పాత్రికేయలతో ముచ్చటించారు, ఆయనతో జరిగిన చిట్ చాట్ లో కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ మీర్జాపూర్ సీజన్ 1 లో నేను పోషించిన కాలిన్ భయ్య పాత్ర నన్ను తెలుగు ఆడియెన్స్ కి మరింత దగ్గర చేసింది. రోజుకి సోషల్ మీడియా ద్వారా తెలుగు వారు పంపిస్తున్న మెసేజ్ లు చదువుతున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఇక మీర్జాపూర్ సీజన్ 2 రాబోతుందనే ప్రకటణ వచ్చినప్పటి నుంచి తెలుగులో రిలీజ్ అవుతుందా లేదా అని…