స్వచ్ఛంద సంస్థలకు మెగాస్టార్ విరాళం

Megastar donates to charities

స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా గద్దర్ అవార్డ్స్ నగదు బహుమతి ‘మన శంకర వర ప్రసాద్ గారు’ బ్లాక్‌బస్టర్ విజయాన్ని ఆస్వాదిస్తూ ప్రస్తుతం పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులకు సిద్ధమవుతున్న మెగాస్టార్ చిరంజీవి, తన కుమారుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజును ప్రత్యేకంగా జరుపుకోవాలని నిర్ణయించారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం చేతుల మీదుగా ఎన్టీఆర్ అవార్డుతో పాటు పది లక్షల నగదు బహుమతి అందుకున్న చిరంజీవి, ఆ మొత్తాన్ని తన చిరకాల సామాజిక సంక్షేమ లక్ష్యానికి అనుగుణంగా ఉన్న ఐదు స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇచ్చారు. వారి దైనందిన అవసరాలకు మద్దతుగా చిరంజీవి ‘సర్వ్ ఫౌండేషన్’కు విరాళం అందించారు. “గేమ్ ఛేంజర్” షూటింగ్ సమయంలో రామ్ చరణ్‌ను కలిసిన వృద్ధులు ఆయన పుట్టినరోజును జరుపుకోవాలని ఆశపడగా, చిరంజీవి ఆ కోరికను నెరవేర్చారు. 30 మంది వృద్ధులను బ్లడ్…