వెంకట్ ప్రభు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న `మ‌న్మ‌థ‌లీల` పోస్ట‌ర్ విడుద‌లైంది

Manmadaleela

చెన్నై 28, ది లూప్‌, మ‌న‌క‌థ` చిత్రాల ఫేమ్ వెంకట్ ప్రభు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ద్విబాషా చిత్రం రూపొందుతోంది. తమిళం)లొ మన్మథలీలై, తెలుగులో మన్మదలీల పేరును ఖ‌రారు చేశారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ఆదివారంనాడు చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఈ చిత్రం వెంక‌ట్ ప్ర‌భుకు 10వ చిత్రం కావడం విశేషం. అందుకే `వెంకట్ ప్రభు క్వికీ` అనే టాగ్ పెట్టారు. తమిళ నటుడు ‘పిజ్జా 2’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అశోక్ సెల్వన్ హీరోగా నటిస్తుండ‌గా ఆయ‌న స‌ర‌స‌న సంయుక్త హెగ్డే, స్మ్రుతి వెంకట్, రియా సుమన్ నాయిక‌లుగా నటిస్తున్నారు. గ‌తంలో క‌మ‌ల్‌హాస‌న్‌, శింబు చిత్రాల‌కు ఇదేపేరుతో స‌క్సెస్ సాధించారు. ఇప్పుడు మ‌రోసారి మ‌న్మ‌థ‌లీల పేరుతో వెంక‌ట్ ప్ర‌భు చేయ‌డం విశేషం. ఈ తాజా సినిమాను రాక్‌ఫోర్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ బేన‌ర్‌పై…