2.0, పొన్నియిన్ సెల్వన్ వంటి సినిమాలను నిర్మించి అందరి మన్ననలు అందుకుని ఇప్పుడు ఇండియన్ 2, రజినీకాంత్ 170 చిత్రాలతో ఆడియెన్స్‌ని వావ్ అనిపించటానికి సిద్ధమవుతోన్న నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్. భారీ బడ్జెట్ సినిమాలనే కాదు, డిఫరెంట్ కంటెంట్ చిత్రాలను కూడా పేక్షకులకు అందించటానికి లైకా సంస్థ ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఆ కోవలో లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ నుంచి రాబోతున్న మరో డిఫరెంట్ మూవీ ‘మిషన్ చాప్టర్ 1’. అరుణ్ విజయ్, ఎమీ జాక్సన్, నిమిషా సజయన్ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రంలో అబి హాసన్, భరత్ బొపన్న, బేబి ఇయల్ ప్రధాన పాత్రల్లో మెప్పించనున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ విజయ్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రానికి ఎం.రాజశేఖర్, ఎస్.స్వాతి నిర్మాతలు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్.…