కెరాఫ్ కంచెరపాలెం చిత్రం లో జోసెఫ్ గా నటించి వీక్షకుల్ని ఆకట్టుకున్న కార్తిక్ రత్నం హీరోగా, సుప్యార్ధ్ సింగ్ హీరోయిన్ గా ప్రముఖ నిర్మాత యాదగిరి రాజు శ్రీకళ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ లో, బ్లాక్ బాక్స్ స్టూడియోస్ సమర్పణ లో నిర్మిస్తున్న చిత్రం లింగొచ్చా (గేమ్ ఆఫ్ లవ్).. ఈ చిత్రానికి ఆనంద్ బడా దర్శకత్వం వహిస్తున్నారు. దర్శకుడు హైదరాబాది కావటం వలన ఇక్కడ ఎంతో ఫేమస్ అయిన లింగోచ్చా గేమ్ నేపధ్యం లో ఒక చక్కటి ప్రేమకథని రాసుకుని తెరకెక్కించారు. అంతే కాదు ఈ ప్రేమకథ కి లింగోచ్చా అనే టైటిల్ ని ఖరారుచేయటం విశేషం. ఈ టైటిల్ విన్న ప్రతిఓక్కరూ సౌండింగ్ కొత్త గా వుందని అనటం యూనిట్ కి కొత్త ఎనర్జి ఇచ్చింది. ఇదే ఎనర్జితో లింగోచ్చా టీజర్ ని రెడి చేశారు.…
Tag: lingocha
‘లింగొచ్చా’ చిత్ర టీజర్ విడుదల ఎప్పుడంటే..?
శ్రీకల ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై బ్లాక్ స్టూడియోస్ సమర్పణలో యాదగిరి రాజు నిర్మిస్తున్న చిత్రం లింగొచ్చా. ఈ సినిమాతో ఆనంద్ బడా దర్శకునిగా చిత్ర సీమకు పరిచయం అవుతున్నారు. కెరాఫ్ కంచెర పాలెం ఫేమ్ కార్తీక్ రాజు ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. కార్తీక్‌కి జోడిగా సుప్యార్దే సింగ్ నటిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అటు ఇండస్ట్రీ వర్గాల్లో ఇటు ఆడియెన్స్‌లో లింగొచ్చా అనే టైటిల్‌కి అనూహ్య స్పందన రావడం చాలా ఆనందంగా ఉందని, ఈ నేపథ్యంలోనే చిత్ర టీజర్‌ను దసరా కానుకగా అక్టోబర్ 23న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత యాదగిరి రాజు, దర్శకుడు ఆనంద్ బడా తెలిపారు. ఈ సినిమాకు సంగీతాన్ని బికాజ్ రాజ్ అందిస్తున్నారు. నటీనటలు:కార్తీక్ రత్నమ్, సుప్యార్దే సింగ్, బెబీ ఫిదా మొగల్, మాస్టర్ ప్రేమ్ సుమన్,…