మలయాళ సూపర్‌స్టార్, కంప్లీట్ యాక్టర్ మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబోలో తెరకెక్కిన భారీ చిత్రం ‘L2E: ఎంపురాన్’. చిత్రాన్ని ఆశీర్వాద్ సినిమాస్, శ్రీ గోకులం మూవీస్ బ్యానర్లపై ఆంటోనీ పెరుంబవూర్, గోకులం గోపాలన్ నిర్మించారు. మురళీ గోపి కథను అందించారు. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా మార్చి 27న మలయాళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ అవుతుంది. ఈ క్రమంలో శనివారం నాడు చిత్రయూనిట్ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా… సూపర్‌స్టార్, కంప్లీట్ యాక్టర్ మోహన్‌లాల్ మాట్లాడుతూ .. ‘మా సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్న దిల్ రాజు గారికి థాంక్స్. 47 ఏళ్లుగా ఈ సినీ ఇండస్ట్రీలో నా ప్రయాణంలో తెలుగు చిత్ర సీమతో ఎంతో అనుబంధం ఉంది. అక్కినేని నాగేశ్వరరావు గారితో నటించే అదృష్టం నాకు…